సీఈసీని కలిసిన వైసిపి బృందం

CEC
CEC

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు. ఈ మేరకు పార్టీ నేతల బృందం సీఈసీని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్‌ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, చంద్రగిరి పరిధిలో రీ పోలింగ్‌ సజావుగా జరిగేలా చూడాలని సీఈసీని కోరినట్లు వివ‌రించారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లామ‌న్నారు.