‘దొరసాని’ సినిమాతో ‘రౌడీ’ తమ్ముడు ఎంట్రీ…!

Dorasani Movie
Dorasani Movie

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో తన కూడా సత్తా చూపించాడు. ఇంకా అన్న విజయ్ దేవరకొండ స్పూర్తితో తమ్ముడు ఆనంద్ కూడా హీరోగా పరిచయమవుతున్నాడు. కె.వి.ఆర్ మహేంద్ర డైరక్షన్ లో వస్తున్న ‘దొరసాని’ సినిమాతో ఆనంద్ ప్రేక్షకులకి పరిచయం అవుతున్నాడు.టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటివలే విడుదల చేసింది చిత్ర బృందం. సమ్మర్ లో ఈ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.