కేసీఆర్ ఫ్రంట్ పై రాముల‌మ్మ సెటైర్లు

Vijayashanthi

ఫెడరల్ ఫ్రంట్ ని… ఫెడ్ అప్ ఫ్రంట్ అంటూ రాముల‌మ్మ సెటైర్లు వేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశమంతా తిరిగిన సిఎం కేసీఆర్ … చివరకు వైసీపీ మద్దతు మాత్రమే పొందగలిగారని ఎద్దేవా చేశారు.

ఫ్రెడరల్ ఫ్రంట్ పేరుతో సిఎం కేసీఆర్ కలిసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ లాంటి నాయ‌కులు కోల్‌కతాలో జరిగిన మహాకూటమి సభలో పాల్గొని బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు మద్దతిచ్చారన్నారు విజయశాంతి. టీఆర్ఎస్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతుందేమోనని ఆమె అన్నారు.