సిఈసికి విజయసాయి రెడ్డి లేఖ

Vijay Sai Reddy
Vijay Sai Reddy

కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని ఆయన లేఖలో వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలను మోహరించాలని కోరారు. అన్ని స్ట్రాంగ్ రూమ్‌లలో 24 గంటలు సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలన్నారు. ఈసీకీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదని, రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉంచాలని ఆయన కోరారు.