సుల్తాన్ తో రౌడీ ‘ఢీ’

#DearComrade ,#VijayDevarakonda , @TheDeverakonda , #dearcomrade, @iamRashmika ,#BharathKamma,
VijayDeverakonda

విజయ్ దేవరకొండ సినిమాల్లో అతని టైమింగ్ మాత్రమే కాదు అతని సినిమాలు రిలీజ్ అయ్యే టైం కూడా సూపర్ గా ఉంటుంది.పెద్దగా పోటీలేని టైం లో థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్స్ అనిపించుకుంటూ ఉంటాయి.అది కావాలని ప్లానింగ్ ప్రకారం చెయ్యకపోయినా కూడా అలానే జరుగుతూ ఉంటుంది.కానీ ఫస్ట్ టైం విజయ్ తన డియర్ కామ్రేడ్ తో ఒక పెద్ద సినిమాని ఢీ కొట్టబోతున్నాడు.అదే సల్మాన్ ఖాన్ భరత్.ఈ సినిమా హిట్ అవ్వాలని సల్మాన్ ఖాన్ అభిమానులు మాత్రమే కాదు సల్మాన్ కూడా కోరుకుంటున్నాడు.అందుకే తనకి గతంలో సుల్తాన్,టైగర్ జిందా హై లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్ తో జతకట్టి భరత్ సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో కత్రినా,దిశాపటాని లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా నటిస్తుండడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.అయితే డియర్ కామ్రేడ్ రిలీజ్ కి భరత్ రిలీజ్ కి 5 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది.మామూలుగా అయితే ఇది పెద్ద మ్యాటర్ కాదు.కానీ డియర్ కామ్రేడ్ ని సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు.అయితే తెలుగు రాష్ట్ట్రాలు తప్పిస్తే మిగతా చోట్ల ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే మల్టిప్లెక్స్ ల్లో మాత్రం భారీ పోటీ ఉంటుంది.ఒక వేళ డియర్ కామ్రేడ్ కి మిస్క్డ్ టాక్ వచ్చినా,భరత్ కి హిట్ టాక్ వచ్చినా కూడా స్క్రీన్స్ అన్నీ సల్మాన్ సినిమానే ఆక్రమించేస్తుంది.మరి విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం వెళ్ళబోతున్న ఈ మాసివ్ ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.