బాలీవుడ్ పై విజయ్ బ్రాండ్

Vijay Devarakonda
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ….తెలుగులో లేటెస్ట్ సెన్సేషన్.ఇతనికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ సామాన్యమైంది కాదు.కానీ విజయ్ ఆరా కేవలం తెలుగుకే పరిమితం కాదు.బాలీవుడ్ లో కూడా విజయ్ ని లాంచ్ చేసే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి.ఈ లోగా అతను నటించిన ఇక్కడ సినిమాలని వరుసపెట్టి అక్కడ రీమేక్ చేస్తున్నారు.విజయ్ యాక్టింగ్ పొటెన్షియల్ ని ఎలివేట్ చేసి అతన్ని స్టార్ గా నిలిపిన అర్జున్ రెడ్డి ఆల్రెడీ షాహిద్ కపూర్ లాంటి హీరో తో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అవుతుంది.

పెళ్లిచూపులు అక్కడ విజయం సాధించకపోయినా కూడా విజయ్ సినిమాల కోసం పోటీ మాత్రం ఆగట్లేదు.విజయ్ ని 100 కోట్ల క్లబ్ లో చేర్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గీతగోవిందం కూడా ఇప్పడు బాలీవుడ్ కి వెళుతుంది.ఈ సినిమా రీమేక్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది.రీసెంట్ గా మరాఠా సినిమా సైరాట్ ని ధఢక్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టిన ఇషాన్ కట్టర్ గీతగోవిందం రీమేక్ లో నటించబోతున్నాడు.ఈ రెండు రీమేక్ సినిమాల రిజల్ట్ ని బట్టి తాను ఎంచుకునే సినిమాల వేవ్ లెంగ్త్ బాలీవుడ్ తో ఏ మేరకు మ్యాచ్ అవుతుందో చూసుకుని ఆ తరువాత తన బాలీవుడ్ రీమేక్ ని కన్ఫర్మ్ చెయ్యబోతున్నాడు మన రౌడీ.