బాహుబలి-2 రికార్డ్ బ్రేక్ చిన్నసినిమా

Uri,Bahubali
Uri,Bahubali

బాహుబలి-1 సినిమా టాలీవుడ్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తే బాహుబలి-2 మాత్రం ఇండియన్ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది.వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న బాహుబలి సిరీస్ ని దాటడానికి అనేక సినిమాలు పోటీ పడ్డాయి.బాలీవుడ్ నుండి సంజు,రేస్-3 ,జీరో లాంటి సినిమాలు బాహుబలిని దాటేస్తాయి అని అంచనా వేశారు కానీ అది కుదరలేదు.

ఇక కేవలం బాహుబలిని బీట్ చెయ్యడమే లక్ష్యం అన్నట్టుగా తెరకెక్కిన ఆమీర్ ఖాన్ సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అయితే డిజాస్టరస్ అనిపించుకుంది.జనవరి 11 న బాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ అయ్యింది.అదే ఉరి:ది సర్జికల్ స్ట్రైక్.ఆ సినిమా కేవలం 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.విక్కీ కౌశల్ మెయిన్ లీడ్ గా రియల్ ఇన్సిడెంట్ అయిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.బావుంటుంది అనే చిన్న పోజిటివిటీ తప్ప అద్భుతాలు సృష్టిస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.

కానీ ఈ సినిమా అందరికి విపరీతముగా కనెక్ట్ అయ్యింది.డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ మార్కెట్స్ అంచనాలకు మించి పెర్ఫార్మ్ చేసి ఇప్పటికే 300 కోట్లు కొల్లగోట్టడమే కాదు వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కి కూడా క్రాస్ చేసింది.ఫుల్ రన్ విషయం పక్కనబెడితే రిలీజ్ అయిన 23 వ రోజు బాహుబలి-2 బాలీవుడ్ లో 6.35 కోట్లు కొల్లగిడితే ఉరి 23 వ రోజు 6.53 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ కి షాక్ ఇచ్చింది.అలాగే 24 వ రోజు బాహుబలి-2 లెక్క 7.80 కోట్లు,కానీ అదే రోజు ఉరి కలెక్షన్స్ మాత్రం 8.71 కోట్లు.

అంటే కోతికి పైగా భారీ మార్జిన్ తో క్రాస్ చేసింది.ఆశలు పెట్టుకున్న సినిమాలు ఉసురుమనిపిస్తే అస్సలు అంచనాలు లేని చిన్నసినిమా భారీ రికార్డ్ ని చేధించింది.రోజు రోజు కి ఉరి కి కలెక్షన్స్ పెరుగుతుండడం విశేషం.ఫుల్ రన్ లో ఉరి బాహుబలి-2 బాలీవుడ్ టోటల్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.