వంగ‌వీటి గూడు ఖ‌రారు

vangaveeti radha
vangaveeti radha

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సైకిల్‌ ఎక్కేందుకు రంగం సిద్ధమై పోయింది . వైసీపీ అధినేత జగన్ తో విభేదించిన రాధా ఇటీవలే ఆపార్టీకి రాజీనామా చేశారు. ఈ నేప‌ధ్యంలో రాధా రాజకీయ భవిష్యత్‌పై జోరుగా ఊహాగానాలు సాగాయి. ఈనెల 25న టిడిపిలో చేరతారంటూ ప్రచా రం హోరెత్తింది. దీనిపై ఆయన అభిమానులు, రాధారంగా మిత్రమండలి సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యా యి. భవిష్యత్‌ రాజకీయాలను బేరీజు వేసుకున్న రాధా టీడీపీలో చేరడమే కరెక్ట్‌ అన్న నిర్ణయానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఇటు రాధా నివాసానికి టీడీపీ నేతలు వెళ్లారు . ఈ సందర్భంగా వంగవీటి రాధాను నేతలు పార్టీలోకి ఆహ్వానించారు . రాధాను కలిసిన టీడీపీ నేతలు టీడీ జనార్దన్‌, అర్జునుడు మీడియాతో మాట్లాడుతూ తమ ఆహ్వానానికి రాధా సానుకూలంగా స్పందించారని, పేదల సమస్యల్ని రాధా తమకు తెలియజేశారన్నారు. వంగ‌వీటి రాధా గురువారం తన అరం గేట్రం గురించి మీడియా ముఖంగా ప్రకటిస్తానని వెల్లడించారు. రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సిఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని స‌మాచారం.