అరుణ్ ప‌వార్ మాటల్లో ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’

ArunPawar, Vajra kavacha govinda, Sapathagiri, ShivaShivamFilms,

అత‌ని పేరు గోవింద. అతను దొంగ. దొంగకు లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలియాలంటే ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’ సినిమా చూడాలి. క‌మెడియ‌న్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా మారిన స‌ప్తగిరి. హీరోగా న‌టిస్తోన్నచిత్రం‘వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌’. ఈ సినిమాకు అరుణ్ ప‌వార్ ద‌ర్శకత్వం గా శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుద‌ల అయింది.

చిత్ర ద‌ర్శకుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ ‘నా ద‌ర్శక‌త్వంలో స‌ప్తగిరి హీరోగా న‌టించిన ‘స‌ప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలుసు కదా. తాజాగా రూపొందిస్తున్న ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’ అంత‌కు మించి స‌క్సెస్ కావాల‌నే కృషి తోచేస్తున్నాం. సినిమా చాలా బాగా వ‌స్తోంది అని అన్నారు. స‌ప్తగిరి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో, ఆ అంశాల‌న్నీ మా సినిమాలో ఉంటాయి అన్నారు. మా క‌థ‌కు అనుగుణంగానే ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’ అనే టైటిల్‌ పెట్టాం. మా నిర్మాత‌లు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ లేదు. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉంటాయి’ అని అన్నారు.