సక్సెస్ ఫార్ములా ఫాలో అవుతున్న వైష్ణవ్ తేజ్

Vaishnav-Tej
Vaishnav-Tej

సాయిధరమ్ తేజ్…మెగామేనల్లుడు అనే ట్యాగ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం,కాలం చెల్లిపోయిన ఫార్ములానే అయినా కూడా కమర్షియల్ సినిమాలు చేస్తూ,వాటిలో చిరు,పవన్ లను ఇమిటేట్ చేస్తూ మూడు హిట్స్ అందుకున్నాడు.వీటిమధ్యలో తన మొదటి సినిమా రేయ్ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయినా కూడా ఆ బ్లేమ్ మాత్రం ఆ సినిమా డైరెక్టర్ ఖాతాలో పడిపోయింది.కానీ మూడు సినిమాల తరువాత సాయి చేస్తున్న రొటీన్ సినిమాలని అందరికి మొహం మొత్తింది.

దాంతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ కి డబుల్ డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి.వెనుక చాలా బ్యాక్ అప్ ఉన్నా కూడా తన కెరీర్ కొనసాగించడానికి సాయి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు.దీంతో ఇప్పడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ మాత్రం మొదటి సినిమా నుండే జాగ్రత్త పడుతున్నాడు.సుకుమార్ రైటింగ్స్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ కలయికలో తన మొదటి సినిమా ఓకే చేసాడు వైష్ణవ తేజ్.

ఆ సినిమాలో సరికొత్తగా కనిపిస్తూ తాను ఏ ఒక్క జోనర్ హీరోగానో ప్రొజెక్ట్ అవ్వాలి అనుకోవట్లేదు అని హింట్స్ ఇచ్చేసాడు.సాయిధరమ్ తేజ్ కూడా ముందు కమర్షియల్ సినిమాల్లోనే లవ్ స్టోరీస్ కూడా కలిపి ప్రెసెంట్ చేసే వాడు.రాను రాను లవ్ స్టోరీ అనే లేయర్ మాయం అయ్యింది.ఆ తప్పు తెలుసుకుని తేజ్ ఐ లవ్ లో మళ్ళీ లవ్ స్టోరీ చేసినా ఉపయోగం లేకుండా పోయింది.దీంతో కాన్సెప్ట్ సినిమాల వైపు వస్తున్నాడు.

చిత్రలహరి ఆ క్యాటగిరీ లో సినిమానే.అయితే వైష్ణవ తేజ్ మాత్రం ఫుల్ గా లవ్ స్టోరీస్ పైనే కాన్సంట్రేట్ చేస్తున్నాడు.అంతేకాదు తన సినిమాలు కాస్త కొత్తదనంతో ప్రయోగాత్మకంగా ఉండేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు.అలాంటి సినిమాలు చేస్తే ఫ్లాప్ హిట్స్ తో సంబంధం లేకుండా కెరీర్ స్టడీ గా ఉంటుంది.అందుకే తన అన్న చేసిన తప్పులు చూసి ఆ దారిలో వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నాడు వైష్ణవ్ తేజ్.సాయి చేసిన కాస్ట్లీ మిస్టేక్స్ అన్నీతమ్ముడికి ఫాలో అవ్వాల్సిన పాఠాలుగా మారాయి.