కేసీఆర్ కు ఉత్త‌మ్ లేఖ

Uttam Kumar
Uttam Kumar

తెలంగాణ సిఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఈ లేఖ‌లో ఆయ‌న కోరారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను మీరెప్పుడూ పట్టించుకోలేదని ఆ లేఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అవినీతి ప్రక్షాళన అంటూ ప్రగల్బాలు పలుకుతున్న మీరు.. ఇంటర్ బోర్డును ఎందుకు ప్రక్షాళన చేయరని ప్రశ్నించారు. రాజకీయ అవినీతిని మీరే ప్రోత్సహిస్తున్నారని ఉత్తమ్ లేఖలో వెల్ల‌డించారు. 10లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ పై ప్రభుత్వం తీరు ఇదేనా అని ప్రశ్నించారు ఉత్త‌మ్.