సల్మాన్ ఖాన్ తో మెగా కోడలు ఇంటర్వ్యూ…!

Salaman-Upasana
Salaman-Upasana

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటించిన తాజా చిత్రం భారత్ రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసి సల్మాన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇదిలా ఉంటే మెగా కోడలు ఉపాసన సల్మాన్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచింది. ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి ‘బిపాజిటివ్’ అనే మ్యాగజైన్‌ను ఉపాసన నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సెలబ్రిటీల ఫిట్‌నెస్ రహస్యాలు, డైట్, హెల్త్‌కేర్ గురించి అడిగి తెలుసుకుని ఆ విషయాలను పాఠకులతో పంచుకుంటుంది.దీనిలో భాగంగానే సల్మాన్ ఖాన్‌ను ఉపాసన ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.