ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ కు ఊహించ‌ని షాక్ ..!

congress party
congress party

మ‌హా కూటమిలో భాగస్వామ్యం అవుతారని భావించిన ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చాయి.దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉత్తర ప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది.ఆ సమయంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కేవలం 5 లోక్‌సభ సీట్లకే పరిమితమైంది.దీంతో ఈ సారి బిజేపి ను ఓడించేందుకు ఎస్పీ గట్టిగానే ప్రయత్నిస్తోంది.ఇందుకోసం చాలా కాలంగా ప్రత్యర్థిగా ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది.

అయితే బిజేపి కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలతో కూటమికి రంగం సిద్ధం చేస్తున్న కాంగ్రెస్‌కు మాత్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎస్పీ-బీఎస్పీ కూటమి తో కాంగ్రెస్ కు హ్యండివ్వ‌నున్నారు.ప్రధాన ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ మాత్రమే కూటమిగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేందుకు నిర్ణయించాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఢిల్లీలో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు యూపీలో కూటమిగా ఏర్పడాలని డిసైడ్ అయ్యారు.

ఇరువురు నేతలు సీట్ల పంపకాలపై చర్చించారు. కాంగ్రెస్ నేతృత్వం వహించే కూటమికి దూరంగా ఉండటానికి ఆయా పార్టీల అధినేతలు మెగ్గు చూపారు. రెండు పార్టీలు సమాన సీట్లలో పోటీ చేయనుండగా.. పశ్చిమ యూపీలో బలంగా ఉన్న ఆర్ ఎల్డీ లాంటి చిన్న పార్టీలను కలుపుకొని ఎన్నికల బరిలో నిలువనున్నాయి. 80 ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయనుండటంతో. రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్‌కు ఇది భారీ ఎదురుదెబ్బ‌గా రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.