సికింద్రాబాద్ ఎంపీగా నందమూరి సుహాసిని

Nandamuri Suhasini, Chandrababu, Chandrashekar Rao, Telangana, Kukatpally, Harikrishna, Ticket, Socialmedia,

నందమూరి సుహాసిని. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు తెలుసు కదా . తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంతో వ్యూహాత్మకంగా తెర పైకి తీసుకువచ్చిన పేరు ఆమె నందమూరి సుహాసిని . అంతవరకూ నందమూరి హరిక్రిష్ణ‌ కుమార్తెగా మాత్రమే బంధువులకు, స్నేహితులకు తెలిసిన నందమూరి సుహాసిని తెలంగాణ మందస్తు ఎన్నికల పుణ్యమాని తెలుగు రాష్ట్రాల్లో తెలిసింది. తెలుగుదేశం పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందనే దీమా తో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసినిని ఎన్నికల బరిలో దించారు CM చంద్రబాబు నాయుడు . అయితే ఈ వ్యూహం కాలేదు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో సుహాసిని అనూమ్యంగా ఓటమి పాలయ్యారు. తరవాత చంద్రబాబు నాయుడు కు నందమూరి సుహాసినిని ఎప్పటి లాగే తన రాజకీయ చతురతలో భాగంగా వదిలేశారు. నందమూరి సుహాసిని ఫోను ఎన్నిసార్లు చేసినా చంద్రబాబు నాయుడి నుంచి స్పందన లేదు అని ఆ మధ‌్య సోషల్ మీడియాలో వార్తలు సైతం వచ్చాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అయితే… ” ఎన్నికల్లో ఆడ కూతురు నిలబెట్టారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల తర్వాత ఆమెను పట్టించుకోలేదు” అని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే చంద్రబాబు నాయుడి పట్ల నందమూరి హరిక్రిష్ణ కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు కదా. హరిక్రిష్ణతో మంచి స్నేహం ఉన్న కేసీఆర్ అతి త్వరలో నందమూరి సుహాసినికి గులాబీ తీర్ధం ఇవ్వనున్నారంటున్నారు. నందమూరి సుహాసినిని పార్టీలో చేర్చుకుని ఆమెకు సికింద్రబాద్ లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇంట్లో ఉన్న ఆడ కూతుర్ని బయటకు లాగి కూకట్‌పల్లి నుంచి శాసనసభకు పోటీ చేయించి తరవాత అతీగతీ పట్టించుకోని చంద్రబాబు నాయుడి కి సికింద్రాబాద్ నుంచి సుహాసినిని గెలిపించి రిటన్ గిఫ్ట్‌ ఇలా ఉందని చూపించాలన్నది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహంగా చెబుతున్నారు.