కుంభ‌మేళాలో కాషాయ‌నేత‌లు

kumba mela
kumba mela

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుంభ మేళాను సందర్శించారు. గంగ, యమునా, సరస్వతి నదులు కలిసే సంగం వద్ద ఆయ‌న పుణ్యస్నానం ఆచరించారు. అమిత్‌ షాతో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మరికొందరు బీజేపీ నేతలు, సాధువులు కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు.

అనంతరం అమిత్‌ షా ప్రత్యేక పూజలు చేసి నదికి హారతి ఇచ్చారు. జునా అఖాడా ఆశ్రమంలో ఆచార్య మహామండలేశ్వర్‌ అవదేశానంద్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు అమిత్ షా . సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి అమిత్‌ షా సహ పంక్తి భోజనాలు చేశారు.