టీవీ9 సిఇఓ రవిప్రకాష్ కోసం పోలీసులు గాలింపు…!

TV9 Ravi Prakash
TV9 Ravi Prakash

టీవీ9 సీఈవోగా రవిప్రకాష్ ను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కంపెనీకి సంబంధించిన నిధులు మళ్లించారని, కీలక వ్యక్తుల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ టీవీ9 యాజమాన్యం సీఈవో రవిప్రకాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి.. ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా.

సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు పెట్టింది. కాగా రవిప్రకాష్‌ని విచారించేందుకు ఆతని ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆయన యన అందుబాటులో లేకుండా పోయారు. దీంతో రవి ప్రకాష్ భార్యకు 160 సీఆర్‌పీసీ నోటీసులు అందజేసి, రేపు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. టీవీ9 యాజమాన్యానికి తెలియకుండా నిధులు మళ్లించారని ఆరోపణ లు ఎదుర్కొంటున్న రవిప్రకాష్ అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది.