తెలంగాణలో కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చిన టి ఆర్ ఎస్ ..!

TRS Vs T Congress
TRS Vs T Congress

తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు శాసనమండలి సభ్యులపై వేటు పడింది.  ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డిపై వేటు వేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కొరడా ఝుళిపించారు.  ఇప్పటికే ఈ ముగ్గురు నేతలకు సంబంధించిన వివరణలు తీసుకున్న మండలి చైర్మన్,   తాజాగా నిబంధనల మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.   ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ కు  అధికార టీఆర్ఎస్  ఝలక్ ఇచ్చిన‌ట్ల‌య్యింది.