ప్రాదేశిక ఎన్నికల‌ ఏక‌గ్రీవాల్లో కారు జోరు

trs party
trs party

తొలి దశ ప్రాదేశిక ఎన్నికల ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్ హ‌వా ప్రదర్శించింది. వివిధ జిల్లాల పరిధిలో ఏకగ్రీవమైన 69 ఎంపీటీసీల్లో టీఆర్‌ఎస్‌ 67, కాంగ్రెస్‌ 2 కైవసం చేసుకున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు జెడ్పీటీసీ, నిజామాబాద్‌ జిల్లా మాక్లూరు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే వాటిని కూడా టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో 96 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా… వాటిలో 10 స్థానాలు టీఆర్‌ఎస్‌ పక్షాన ఏకగ్రీవమయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఆరేసి ఎంపీటీసీ సీట్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో చెరో ఎంపీటీసీ సీటును కాంగ్రెస్‌ గెలుచుకొని ఉనికి చాటుకుంది. ఈ నెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.