రెండ‌వ విడ‌త‌లోనూ గుభాళించిన గులాబీ పార్టీ

Elections
Elections

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది. తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్లోనూ టి ఆర్ ఎస్ జోష్‌ కనిపించింది. రెండవ విడత గ్రామపంచాయతీలలో మొత్తం 4,130 పంచాయతీలలో 2610 మంది టి ఆర్ ఎస్ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు.

835 మంది అభ్యర్థులు కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులు 37 మంది విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థులు 39 మంది, సిపిఐ 13 , సీపీఎం 24 పంచాయతీలను గెలుచుకోగా 561 మంది అభ్యర్థులు ఇతరులు గెలుపొందారు.