హ‌రీష్ రావు స్టార్ క్యాంపెయినర్ కాదా ..!

Harish Rao
Harish Rao

తెలంగాణలో అధికార పార్టీకి చెందిన కీల‌క నేత‌, మాజీ మంత్రి హ‌రీష్ రావుకు మ‌రో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే కేబినెట్ లో ఆయ‌నకు చోటు ల‌భించ‌లేదు. ఈ నేప‌ధ్యంలోనే టి ఆనే్ ఎస్ పార్టీ అధిష్ఠానం ఆయనకు మరో ఝ‌ల‌క్ ఇచ్చింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కూడా హ‌రీష్ రావుకు స్థానం దక్కలేదు. ఎన్నికల సంఘానికి 20 స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్ఎస్ పంపింది.

దీనిలో సిఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేబినెట్ లోని 11 మంది మంత్రులు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఐదుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, బండా ప్రకాశ్, జే సంతోష్ కుమార్, టీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో మాజీ మంత్రి హరీశ్ రావుకు స్థానం దక్కకపోవడం పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.