పంచాయ‌తీ ఫ‌లితాల్లో జోరు మీదున్న కారు

Panchayat Elections
Panchayat Elections

తెలంగాణలో కారు జోరు కంటిన్యూ అయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించ‌డంతో మ‌రోసారి గులాబి గుభాళించింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు సత్తా చాటారు. సగానికి పైగా సీట్లలో గులాబీ జెండా రెపరెపలాడగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మినహా మిగతా పార్టీల‌న్నీ చ‌తికిల‌ప‌డ్డాయి. స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల తమ బలం నిరూపించుకున్నారు.

ఇప్పటికి మొత్తం గ్రామపంచాయతీలలో 2629 మంది టిఆర్ ఎస్ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు. 920 మంది అభ్యర్థులు కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులు 66 మంది విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థులు 31 మంది, సిపిఐ 19, సీపీఎం 32 పంచాయతీలను గెలుచుకోగా 758 మంది అభ్యర్థులు ఇతరులు గెలుపొందారు. తొలివిడ‌త పంచాయ‌తీ పోరులో అధికార టి ఆర్ ఎస్ మ‌ద్ద‌తుదారుల ప్ర‌భంజ‌నం స్ప‌ష్టంగా క‌నిపించింది.