జెర్సీ కి క్లయిమాక్స్ ల గోల

JERSEY
JERSEY

జనరల్ గా ఏ సినిమాకి అయినా ఒకటే క్లయిమాక్స్ ఉంటుంది.కానీ జెర్సీ సినిమాకి మాత్రం రెండు క్లయిమాక్స్ లు ఉంటాయి అని ఒక మాట బాగా ట్రెండ్ అయ్యింది.సినిమా యూనిట్ దానిపై రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆ న్యూస్ వైరల్ అయ్యింది.జెర్సీ సినిమా నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ కి అనుబంధ సంస్థ అయిన హారికా అండ్ హాసిని కి త్రివిక్రమ్ బాగా క్లోజ్ అవ్వడంతో ,త్రివిక్రమ్ ఫైనల్ చేసిన క్లయిమాక్స్ ఉంచుతారు అనే గాసిప్ ఎక్కువగా వినిపించింది.

గతంలో ప్రేమమ్ సినిమా టైం లో త్రివిక్రమ్ ఓకే చేసిన వెర్షన్ ని ఫైనల్ చేశారు.అందుకే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని ఊహించుకున్నారు కొంతమంది.కానీ ఇది టిపికల్ స్టోరీ.పైగా గురూజీ కూడా బన్నీ సినిమా స్క్రిప్ట్ పనుల్లో టూ బిజీ.పైగా నాని కూడా షూట్ కంటే ముందే చాలా రోజులు స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు.దీంతో మళ్ళీ త్రివిక్రమ్ ని ఎందుకు ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ చేస్తారు?.

అయితే ఈ గాసిప్ విన్న టీమ్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది అని ఎంజాయ్ చేస్తూ కూర్చోవడంతో అది ఏకంగా వైరల్ గా మారింది.అయితే దానివల్ల సినిమాకి ఎలాంటి నష్టం లేకపోవడం వల్లకూడా దానికి ఎలాంటి రెస్పాన్స్ లేదు.ఇప్పటికే ఆల్మోస్ట్ జెర్సీ ఫైనల్ కాపీ లాక్ చేసారు.అనుకున్నట్టుగానే ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు