మాటల మాంత్రికుడు దర్శకత్వంలో అల్లుఅర్జున్…!

Stylish Star Allu Arjun
Stylish Star Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ సినిమా తరువాత తన తరువాత సినిమా కోసం చాల గ్యాప్ తీసుకున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన కొత్త సినిమా గురించి అప్డేట్ ని ఈరోజు విడుదల చేసారు.2018 ఎండింగ్ సందర్భంగా ఆ అప్‌డేట్ ఇచ్చారు.అల్లు అర్జున్ 19వ చిత్రం మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

ఈ సినిమాని నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’,’గీతాఆర్ట్స్’బ్యానర్ ఫై రాధాకృష్ణ (చినబాబు),అల్లు అరవింద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇది మూడవ చిత్రం.గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.జనవరి, 2019లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.