త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్

Trivikram
Trivikram

త్రివిక్రమ్ సినిమాల పరంగా జీనియస్.అయితే అనుకున్న అవుట్ ఫుట్ రావడం కోసం అన్నీ తాను అనుకున్నట్టుగా,తన కనుసన్నల్లో జరగాలి అనేది గురూజీ కండిషన్.పైగా త్రివిక్రమ్ నే నమ్ముకుని మొదలుపెట్టిన హారిక హాసిని క్రియేషన్స్ లో వరుసగా సినిమాలు చేస్తూ రావడం,అక్కడ త్రివిక్రమ్ మాటే వేదవాక్కులా చలామణి అవ్వడంతో అలా నడిచిపోయింది.కానీ అజ్ఞాతవాసి ఫలితం తరువాత పరిస్థితి మారింది.అరవింద సమేత టైం లో స్టీరింగ్ ఎన్టీఆర్ చేతికి వచ్చింది.స్క్రిప్ట్ లాకింగ్ దగ్గరనుండి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ రావడం వరకు అంతా ఎన్టీఆర్ ఆమోదముద్ర తోనే జరిగింది.అరవింద సమేత వీర రాఘవ హిట్ అనిపించుకుంది.ఆ సినిమా ఎక్కడ ఆడింది ఎక్కడ ఆడలేదు అనేది పక్కనబెడితే 100 రోజుల పోస్టర్ అయితే పడింది.

ఎన్ని ఏరియాల్లో లాభాలు వచ్చాయి అనే విషయం వదిలేస్తే ఓవర్ ఆల్ గా త్రివిక్రమ్ అకౌంట్ లో ఒక హిట్ చేరిపోయింది.దాంతో అల్లు అర్జున్ సినిమాకి మళ్ళీ రిమోట్ గురూజీ చేతికి వెళ్ళింది.ఇంతకుముందు హీరోయిన్ తో పాటు కీలక టెక్నీషియన్స్ బన్నీ కూడా కూర్చుని ఫైనల్ చేసేవాడు.కానీ ఈ ఇప్పుడు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరోయిన్…ఇలా అన్ని విషయాల్లో కూడా త్రివిక్రమ్ ఫైనల్ చేసిన ఆప్షన్ ని బన్నీ ఓకే చెయ్యడం అనేది రూల్ అట.అరవింద సమేత హిట్ తో త్రివిక్రమ్ మాటకు వెయిట్ పెరిగింది.అందుకే కాన్ఫిడెంట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నాడు.ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అని తాను రాసుకున్న డైలాగ్ ని పక్కాగా ఫాలో అవుతున్న త్రివిక్రమ్ గ్రేట్ అంతే.