ఎన్టీఆర్ కి అడిక్ట్ అయిపోయిన త్రివిక్రమ్

Jr-NTR-Trivikram-Srinivas
Jr-NTR-Trivikram-Srinivas

జూనియర్ ఎన్టీఆర్ ఎంత టాలెంటెడ్ నటుడో సినిమాపై అంతే డెడికేషన్ కూడా ఉన్న హీరో.అందుకే అతనితో పనిచేసిన డైరెక్టర్స్ అంతా కూడా తారక్ ని పొగడ్తలతో ముంచేస్తారు.రీసెంట్ గా ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేసిన త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ కి పూర్తిగా కనెక్ట్ అయిపోయాడు.సినిమాకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఇంటర్వూస్ లో ఆ విషయం క్లియర్ గా అర్ధమయింది.

అందుకే అల్లు అర్జున్ తో సినిమా మొదలుపెడుతున్నా కూడా అతన్ని కూడా తారక్ లా మేకోవర్ అవ్వమని సూచించాడట.నిజానికి అరవింద సమేత సినిమాకి ఎన్టీఆర్ కి సిక్స్ ప్యాక్ చెయ్యమని త్రివిక్రమ్ చెప్పలేదు.కానీ ఎన్టీఆర్ స్వయంగా అలా మారాడు.దాన్ని త్రివిక్రమ్ ఉపయోగించుకుని అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ తీసాడు.ఇక ఇప్పడు బన్నీ కి కూడా సిక్స్ ప్యాక్ చెయ్యమని చెప్పాడట త్రివిక్రమ్.

ఎన్టీఆర్ తో పనిచేసి ఆ హ్యాంగ్ ఓవర్ వల్ల తన హీరోలందరిని ఎన్టీఆర్ లా చూడాలి అనుకుంటున్నాడు త్రివిక్రమ్ అని కామెంట్స్ వినిపిస్తన్నాయి.అయితే మామూలుగానే ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన బన్నీ కూడా త్రివిక్రమ్ చెప్పినట్టుగా తగ్గడానికి ఓకే అన్నాడట.ఇప్పటికే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ లాక్ అయ్యింది.ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తిచేసుకుని మరొక నెలలో సెట్స్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాకి కూడా పేరు ప్రకటించకుండానే సెట్స్ పైకి వెళుతున్నాడు గురూజీ.హీరోయిన్ ఎవరనేది త్వరలో ప్రకటిస్తారు.