టాలీవుడ్‌లో విషాదం.. | బోయపాటి కో-డైరెక్టర్, ప్రముఖ దర్శకుడి మృతి

టాలీవుడ్ లో ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలకు కో డైరెక్టర్‌గా ఉంటూ పలు చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన సీనియర్‌ టెక్నీషియన్‌ కె.రంగారావు మృతి అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించారు.ఈయన ఎన్నో దశాబ్దాలుగా టాలీవుడ్‌లో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఇంద్రధనుస్సు సినిమా నుంచి దర్శకుడిగా మారిన ఆయన నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఉద్యమం, అలెగ్జాండర్‌ లాంటి సినిమాలతో దర్శకుడిగా చేసారు.కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు.

కొంతకాలంగా ఫిలిం కు దూరంగా ఉంటున్న ఆయన చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. దర్శకుల సంఘంలోనూ కీలక బాధ్యతలు పాత్ర నిర్వహించిన రంగారావు మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం తెలియజేశారు. సోమవారం సాయంత్రం న సూర్యపేట జిల్లా మేడారం గ్రామంలో ఆయన అంత్మయక్రియలు నిర్వహించనున్నారు.