మహేష్ కి అక్కడ భారీ ఫాలోయింగ్

mahesh-babu
mahesh-babu

సౌత్ లో ఉన్న ఇండస్ట్రీస్ లో టాలీవుడ్ పెద్దదే అయినా కూడా కొంతకాలం ముందు వరకు మన హీరోలు,డైరెక్టర్స్ అంతా కూడా గిరి గీసుకుని కూర్చునే వాళ్ళు.కానీ ఈ మధ్య మాత్రం హీరోస్ తమ మార్కెట్ పరిధి పెంచుకోవడం అనే అంశం పై సీరియస్ గా దృష్ట పెట్టారు.టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా పేరున్న అల్లు అర్జున్ కి అనుకోకుండా కేరళలో మంచి క్రేజ్ వచ్చింది.అది గ్రహించిన బన్నీ సరైన టైం లో మంచి డెసిషన్ తీసుకుని తన సినిమాలు మలయాళంలో కూడా డబ్ అయ్యి అక్కడ కూడా రిలీజ్ అయ్యేలా చొరవ చూపాడు.

దాంతో ఇప్పడు అక్కడ బన్నీ కి మంచి మార్కెట్ ఏర్పడింది.మల్లు అర్జున్ గా కేరళ ఫ్యాన్స్ అని అలరిస్తూ అక్కడ తన రేంజ్ ని రోజు రోజు కి పెంచుకుంటున్నాడు.తెలుగు లో సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు కి సరైన కంటెంట్ ఉన్న సినిమా పడితే ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ అని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది.కాకపోతే మహేష్ రెమ్యునరేషన్ వల్ల బడ్జెట్ అనేది కాస్త ఎక్కువ అవుతుంది.

దీంతో తమిళ్ లో కూడా మార్కెట్ స్ట్రాంగ్ చేసుకుందాం అని ముందు శ్రీమంతుడు సినిమా దబ్ చేసి రిలీజ్ చేయించారు.స్పైడర్ ని డైరెక్ట్ గా రెండు భాషల్లో షూట్ చేసారు.కానీ ఫలితం లేకుండా పోయింది.అందుకే రాజమౌళి సినిమాతో బాలీవుడ్ లో అఫిషియల్ గా లాంచ్ అవ్వాలి అనేది మహేష్ ప్లాన్.కానీ ఈ లోగా అనుకోకుండా పంజాబ్ లో మహేష్ కి క్రేజ్ పెరుగుతుంది.మళ్ళీ ఆ ఫ్యాన్స్ లో ఎక్కువమంది ఫిమేల్ ఫ్యాన్స్ ఉండడం ఆశ్చర్యం.

ఈ మధ్య మహేష్ హిందీ డబ్బింగ్ సినిమాలకి ఎక్కువ వ్యూస్ అక్కడినుండే వస్తున్నాయి.దీనికి లాజిక్ లేదు.జస్ట్ మ్యాజికల్ యాక్ట్.దీంతో మహేష్ పాత సినిమాలు కూడా పంజాబీ లోకి అనువదించి రిలీజ్ చేసేందుకు కొంతమంది ఏరాట్లు చేసుకుంటున్నారు.ఆ ప్రాసెస్ క్లిక్ అయితే మాత్రం తెలుగు రైట్స్,హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు పంజాబీ రైట్స్ కూడా సెపరేట్ గా వెళతాయి.అది మరీ పెద్ద మార్కెట్ కాకపోయినా,లక్షల్లో రేటు వచ్చినా అది నిర్మాతకు బర్డెన్ తగ్గించినట్టే.మొత్తానికి అనుకున్నట్టు తమిళ్ లో సక్సెస్ అవ్వలేకపోయిన మహేష్ అనుకోకుండా పంజాబీ లో మార్కెట్ క్రియేట్ చేసుకోవడం విచిత్రం.