కేంద్ర సర్కార్‌ ఏర్పాటులో తృణమూల్‌ కీలక పాత్ర

Mamata-Banerjee
Mamata-Banerjee

కేంద్ర సర్కార్‌ ఏర్పాటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ . రాయిగంజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. ఎన్నికల తర్వాత పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశాలున్నాయన్నారు. అయితే ప్రధాని మోడిని సాగనంపేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ పొత్తులు కుదిరాయన్నారు. మోడిని గద్దె దింపిన తర్వాత నవ భారత నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామన్నారు మమతా బెనర్జీ . అయితే బిజెపి ఎదగడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్‌ పోరాటం చేయలేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ పుంజుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.