రాష్ట్రంలో పాలన పడకేసింది – కోదండ‌రాం

Kodandaram
Kodandaram

రాష్ట్రంలో పాలన పడకేసిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా శనివారం ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని పక్షాలు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రెవెన్యూ శాఖలో సమస్యలున్న మాట వాస్తవమన్నారు. సంస్కరణలపై ప్రభుత్వం అన్ని పక్షాలతో మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ లేకుండా రెండు సార్లు మాత్రమే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మహా కూటమే కీలక పాత్ర పోషించబోతోందన్నారు.