ఆ నాయ‌కులు త‌ట్టుకోలేరంటోన్న ఏపి సిఎం

Election, Political, Ap, Andhara Pradesh, Agriculture , Tdp, Congress, Bjp,
Chandra babu naidu

జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు, నరేంద్రమోదీకి ఓటేసినట్లేనన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు. ఎలక్షన్ మిషన్ 2019పై పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ నీళ్లకు మోకాలడ్డే కేసీఆర్‌తో జగన్ దోస్తీ చేస్తున్నారన్నారు. సొంత ప్రాంతానికి నీళ్లిచ్చినా జగన్‌కు కంటిమంటేనన్నారు ఏపి ముఖ్య‌మంత్రి . నీళ్లు సముద్రంలో కలిసినా టీఆర్ఎస్‌కు ఇష్టమేనని, కానీ వృథాగా పోయే నీళ్లు వాడుకున్నా కేసీఆర్‌ ఓర్వలేకపోతున్నారన్నారు. గోదావరి-పెన్నా అనుసందానానికి టీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తొందని, ఏపీ నదుల అనుసందానంపై దేశం మొత్తం ప్రశంసిస్తుండగా కేసీఆర్, జగన్ మాత్రం తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆంధ్రావాళ్లు ఊడిగం చేయాలనేది కేసీఆర్ ఆలోచన అన్నారు సిఎం చంద్రబాబు.

ఇటు ఏప్రిల్ మొదటి వారంలో రైతులకు మరో రూ.4వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నదాత‌ సుఖీభవ, రుణమాఫీతో రైతుల్లో భరోసా నింపుతున్నామన్నారు. తెలుగుదేశంతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడలేదని, అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరన్నారు ఆయ‌న‌. టీడీపీ డేటా చోరీ విషయంలో సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారని, కానీ ఎక్కడో, ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందన్నారు.