యాంకర్‌ లేని ఆస్కార్ ఫంక్షన్ !

oscar awards, oscar, Function, Stage ,

‘అండ్‌ ది అవార్డ్‌ ఫర్‌ ది బెస్ట్‌ మూవీ గోస్‌ టూ..’ అంటూ ప్రతీ అవార్డ్‌ ఫంక్షన్‌ను రక్తి కట్టించేది యాంకరే కదా. అయితే అన్ని అవార్డ్స్‌లో కల్ల ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్‌కు ఈ ఏడాది యాంకర్‌ (హోస్ట్‌) ఉండక పోవడం మె విశేషం అని చెప్పవచ్చు. ఈ విషయం అధికారికంగా ఆస్కార్‌ బృందం నుంఛి వచ్చింది. ఇలా యాంకర్‌ లేకుండా అవార్డ్స్‌ ఫంక్షన్‌ జరగడం గడిచిన 30 ఏళ్లలో ఇదే మొట్ట మొదటి సారి.

అవార్డ్స్‌ను ప్రదానం చేయడానికి స్టేజ్‌ మీదకు వచ్చే సెలబ్రిటీలు తదుపరి అవార్డులను అలా ప్రకటిస్తారు. నిజానికి ఈ ఏడాది హోస్ట్‌గా కెవిన్‌ హార్ట్‌ షోను నిర్వహించాల్సి ఉంది. కానీ గతంలో కెవిన్‌ చేసిన ట్వీట్స్‌ వివాదం కావడంతో స్వయంగా ఈ పోస్ట్‌ నుంచి అతను తప్పుకున్నారు. తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.