ప్రాంతీయ పార్టీల‌తో ఏపికి న్యాయం జ‌ర‌గ‌దు

Raghuveera Reddy
Raghuveera Reddy

ప్రాంతీయ పార్టీలతో ఆంద్ర‌ప్ర‌దేశ్‌కి న్యాయం జరగదని ఏపీసీసీ అధ్య‌క్షులు రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడింది.. తెచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనేనని ఆయ‌న స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక హోదా భరోసా బ‌స్సు యాత్ర ముగింపు సందర్భంగా రఘువీరా మీడియాతో మాట్లాడారు.

మోదీ ఉచ్చులో పడిపోయిన సిఎం చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ప్రధాని అయితేనే, ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యమని చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామ‌న్నారు ర‌ఘ‌వీరా. ఏపీకి ఒక వైపు అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం బీజేపీనే నమ్ముతున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు. ఏపీకి న్యాయం చేయకుంటే మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు రాబోమని స్పష్టం చేశారు.