పంచాయ‌తీ రెండ‌వ విడ‌త ఎన్నిక‌లు షురూ

Elections
Elections

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. మొత్తం 4 వేల 135 గ్రామ పంచాయతీలకు శుక్ర‌వారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో 788 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి .

శుక్ర‌వారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపును చేప‌డ‌తారు. ఎన్నిక‌ల బరిలో మొత్తం 10వేల 668 అభ్యర్థులు నిలవగా.. 63వేల 480 మంది వార్డు మెంబర్లు బరిలో ఉన్నారు.