గిన్నీస్ బుక్ లోకి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు

polavaram project

పోలవరం ప్రాజెక్టు కొత్త చరిత్ర సృష్టించింది. కాంక్రీట్ పనుల వేగంలో కొత్త రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.కాంక్రీట్ పనుల విషయంలో ఇన్నాళ్లూ దుబాయ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.అనుకున్న సమయం కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థ నవయుగ ఇంజినీరింగ్ కాంక్రీట్ పనులు పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించింది . ఆదివారం అర్ధరాత్రి కల్లా 22,045 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసి రికార్డు సృష్టించింది.

గతంలో దుబాయ్ సంస్థ 24 గంటల వ్యవధిలో 21, 580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి సృష్టించిన రికార్డును పోలవరం బద్దలు కొట్టింది.ఏపికి జీవనాడి అయిన పోలవరం పనుల్లో గిన్నిస్‌ రికార్డుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.నవయుగ ఇంజినీరింగ్‌ ఎండీ శ్రీధర్, ప్రభుత్వ అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.పోలవరంలో గిన్నిస్‌ రికార్డు సాధించడం గర్వకాణమని సీఎం అన్నారు.ఇదో భగీరథ ప్రయత్నం.. పోలవరం నిర్మాణం మహా యజ్ఞమని ఆయన అభివ‌ర్ణించారు.