సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై క‌మ‌ల‌నాధుల మేధోమ‌ధ‌నం

BJp
BJp

భారతీయ జనతాపార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఇవాళ్టి నుంచి జ‌ర‌గ‌నున్నాయి. రెండ్రోజుల పాటు నిర్వహించనున్న సమావేశాలకు ఢిల్లీ రామ్ లీలా మైదానం వేదిక కానుంది. ఈ సమావేశంలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీ రెండ్రోజులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.ప్రధానికోసం తాత్కాలిక కార్యాలయాన్ని కూడా రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి దేశ నలుమూల నుంచి సుమారు 12 వేల మంది ప్ర‌తినిధులు హాజరయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరామ్, తెలంగాణలో పార్టీ ఓటమికి గల కారణాలను సైతం ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా హాజరుకానున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలే ప్రధాన అంశం కానుంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఈ భారతీయ జనతాపార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.