ఏపి డిజిపిపై సీఈసీకి బిజేపి ఫిర్యాదు

AP DGP CEC
AP DGP CEC

ఆంధ్రప్రదేశ్ డీజీపీని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్ల‌డించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఏపీ బీజేపీ నేతలు కలిసి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని సీఈసీని కోరినట్లు వివ‌రించారు. రాష్ట్రంలో అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయ‌న విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు ఆయ‌న .