డిఫరెంట్ సినిమాలో నటిస్తున్న విజయ్

Thalapathy VIJAY 63rd Movie Starts
Thalapathy VIJAY 63rd Movie Starts

గతకొంతకాలంగా వరుసగా వివాదాస్పద సినిమాలు చేస్తూ కాంట్రవర్సీలతోనే భారీ విజయాలు అందుకుంటున్న తలపతి విజయ్ తన రూట్ మార్చాడు.తనకు ఆల్రెడీ తేరి,మెర్సల్ లాంటి భారీ విజయాలు అందించిన అట్లీ డైరెక్షన్ లో మూడో సినిమా స్టార్ట్ చేసాడు.అయితే ఆ సినిమా పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో విజయ్ ఒక లేడి ఫుట్ బాల్ టీమ్ కి కోచ్ గా కనిపిస్తున్నాడు.గతంలో స్టార్ హీరోస్ అయిన షారుఖ్,వెంకటేష్ కూడా ఇలాంటి కాన్సప్ట్ తొంనే సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు.ఇప్పడు విజయ్ ఈ డికెఫెరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు.వేరే సినిమాలు చూసి ఇన్స్పయిర్ అయ్యి తన స్టైల్ లో మాసీ ట్రీట్మెంట్ తో కథలు రెడీ చేసుకునే అట్లీ ఈ సినిమాకి కూడా అలాంటి కాన్సెప్ట్ నే ఎంచుకున్నాడు.

విజయ్ ఇలాంటి సినిమా యాక్సెప్ట్ చెయ్యడం మాత్రం నిజంగా సర్ప్రైసింగ్ డెసిషన్ అని ఒప్పుకోవాలి.ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండడం మరో పెద్ద పాజిటివ్ కార్నర్.మొన్నటివరకు మాస్ మసాలా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకున్న విజయ్ మంచి డెసిషనే తీసుకున్నా కూడా అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది మాత్రం బిగ్ క్వశ్చన్ మార్క్.