ప‌వ‌న్ ఆవేశం త‌గ్గించుకో అంటోన్న వెంక‌టేష్ ..!

TG-Venkatesh
TG-Venkatesh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడితే బావుంటుంద‌ని కౌంట‌ర్ ఇచ్చారు టీడీపీ నేత టీజీ వెంకటేష్. ఎక్కడో స్క్రోలింగ్ చూసి స్పందించడం నాయకుడి లక్షణం కాదని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడా తప్పుగా మాట్లాడలేద‌ని.. అగౌరవంగా మాట్లాడలేదని.. పవన్ ఏం మాట్లాడానో విని స్పందిస్తే బావుండేదన్నారు టీజీ వెంకటేష్.

ఆవేశం తగ్గించుకుంటే పవన్ కు మంచి భవిష్యత్ ఉంటుందన్న అయన , కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు కానీ నాయ‌కుల‌కు ఆవేశం ఉండకూడదన్నారు. పొత్తులపై ఫైనల్ నిర్ణయం సిఎం చంద్రబాబుదేనన్నారు టీజీ వెంకటేష్. తామెప్పుడూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలమేనని స్ప‌ష్టం చేశారు.