టెంపర్ రీమేక్:అన్ స్టాపబుల్

Simbaa movie

స్టార్ హీరోస్ లో ఇప్పడు ఎన్టీఆర్ కి ఉన్న సక్సెస్ కన్సిస్టెన్సీ ఎవ్వఁరికి లేదు అని చెప్పాలి.కానీ దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది మాత్రం టెంపర్ సినిమా.ఆ సినిమా కమర్షియల్ గా కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యింది.కానీ ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన,టచ్ చేసిన పాయింట్,పూరి మార్క్ టేకింగ్ అన్నీ కూడా వాళ్ళకి కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.అలాంటి సినిమా ఇప్పడు సింబా పేరుతో హిందీ లో రీమేక్ అయ్యింది.సింబా కూడా ఘన విజయం సాధించింది.ఈ సినిమాలో రణ్వీర్ నటన కూడా ఆకట్టుకుంది.

ఈ స్టోరీ కి నార్త్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు ఆకట్టుకున్నాయి.దాంతో ఈ సినిమాకి అక్కడ కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.కేవలం 5 రోజుల్లో 125 పాతిక కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.దాంతో తెలుగు సినిమాల పై అంటే వాళ్ళ భాషలో సౌత్ సినిమాలపై మరింత నమ్మకం పెరిగింది.అక్కడ టెక్నీషియన్స్ కూడా తెలుగు నుండి ఆఫర్ అనగానే కన్సిడర్ చేస్తున్నారు.ఇక ఈ రీసెంట్ విక్టరీ బాలీవుడ్ లో మన వెయిట్ ని మరింతగా పెంచుతుంది అనడంలో నో డౌట్.