దాదాపుగా ఖ‌రారైన తెలుగుదేశం పార్టీ ఎంపి జాబితా

TDP, CONGRESS, TRS, BJP, CHANDRABABU NAIDU,
tdp

తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం జాబితా ఈ విధంగా వుంది. శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు, విజయనగరం- అశోక్‌ గజపతిరాజు, అరకు- కిషోర్‌ చంద్రదేవ్‌, అనకాపల్లి- ఆడారి ఆనంద్‌, కాకినాడ- చలమలశెట్టి సునీల్‌, ఏలూరు- మాగంటి బాబు, అమలాపురం- జీఎంసీ హరీష్‌, మచిలీపట్నం- కొనకళ్ళ సత్య నారాయణ, విజయవాడ- కేశినేని నాని, గుంటూరు- గల్లా జయదేవ్‌, నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు, బాపట్ల- శ్రావణ్‌ కుమార్‌, ఒంగోలు- శిద్దా రాఘవరావు, నెల్లూరు- బీదా మస్తాన్‌రావు, చిత్తూరు- శివప్రసాద్‌, తిరుపతి- పనబాక లక్ష్మి, కర్నూలు- కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, కడప- ఆది నారాయణరెడ్డి, హిందూపురం- నిమ్మల కిష్టప్ప , అనంతపురం- జేసీ పవన్ గా నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. ఇంకా రెండు మూడు స్థానాలు ఖ‌రారు కావాల్సి వుంది.