ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోదీ ఆచూకీని క‌నిపెట్టిన ది టెలిగ్రాఫ్ పేపర్‌

Nirav Modi
Nirav Modi

త‌ప్పించుకుని తిరుగుతున్న ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోదీ ఆచూకీని క‌నిపెట్టింది ది టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ . పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును 13 వేల కోట్ల రూపాయిలు మోసగించి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ లండన్‌లో నివసిస్తున్నాడు.

లండన్‌లోని వెస్ట్‌ ఎండ్‌ ప్రాంతంలో వీధిలో నీరవ్‌ మోడీ నడుస్తూ వెళుతుండగా గమనించినట్లు బ్రిటిష్‌ న్యూస్‌ పేపర్‌ ది టెలిగ్రాఫ్‌ వార్త ప్రచురించింది. టెలిగ్రాఫ్‌ పత్రిక ప్ర‌తినిధి నీరవ్‌ మోడీని ప్రశ్నించడానికి ప్రయత్నించగా అతడు మాట్లాడకుండా వేగంగా నడుస్తూ ముందుకు వెళ్లిపోయాడు. ఒక క్యాబ్‌ బుక్‌ చేసుకోవడానికి ఆ క్యాబ్‌ డ్రైవర్‌తో మాట్లాడి, మళ్లి ముందుకు వెళ్లి మరొక క్యాబ్‌ ఎక్కి వెళ్లిపోయాడని టెలిగ్రాఫ్ వెల్ల‌డించింది.

లండన్‌లోని వెస్ట్‌ ఎండ్‌లో ఉన్న సోహో ప్రాంతంలో నీరవ్‌ మోడీ వజ్రాల వ్యాపారం ప్రారంభించాడని ఆ పత్రిక పేర్కొంది. లండన్‌లోని సెంటర్‌ పాయింట్‌ టవర్‌ బ్లాక్‌లోని మూడు పడక గదుల నివాసంలో నీరవ్‌ ఉంటున్నాడు. దీనికి నెలకు 17వేల పౌండ్లు పైగా అద్దె ఉంటుందని సమాచారం. అక్కడికి దగ్గరలో ఉన్న సోహోలో నీరవ్‌ వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు కూడా ఆ పత్రిక తెలిపింది. బ్రిటిష్‌ న్యూస్‌ పేపర్‌ ది టెలిగ్రాఫ్‌ ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.