తొలివిడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ బ‌రిలో ల‌క్ష దాటారు..!

panchayat elections
panchayat elections

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ స్పందన కనిపించింది. తొలివిడతలో జరిగే పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌ స్థానాలకు, వార్డు పదవులకు కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య లక్ష దాటిపోయింది. తొలిదశ కింద 4 వేల‌ 479 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులతోపాటు వాటి పరిధిలోని 39 వేల 822 వార్దు స్థానాలకు ఎన్నికలు జ‌రుగుతున్నాయి. ఫ‌స్ట్ ఫేజ్ నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోయింది. సర్పంచ్‌ స్థానాలకు మొత్తం 27,940 నామినేషన్లు, వార్డు స్ధానాలకు 97,690 నామినేషన్లు దాఖలయ్యాయి.

రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో రికార్ట్‌ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి . ఈ జిల్లాలో తొలిదశ కింద మొత్తం 304 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా… సర్పంచ్‌ స్థానాలకు 2 వేల 231 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాలకు దాఖలైన‌ నామినేషన్లలో సంగారెడ్డి జిల్లా రికార్డు సృష్టిం చింది. ఈ జిల్లాలో 2 వేల 398 వార్డులకు జరుతుగున్న ఎన్నికల్లోమొత్తం 7 వేల 576 నామినేషన్లు దాఖలయ్యాయి. అతి తక్కువ నామినేషన్లు దాఖలైన జిల్లాల్లో మేడ్చెల్‌ మల్కాజిగిరి 199 నామి నేషన్లు దాఖ లయ్యాయి. వార్డు స్థానాలకు అతితక్కువ నామినేషన్లు దాఖలైనవాటిలో మేడ్చెల్‌ మల్కాజిగిరి జిల్లాలో 1178 నామినేష‌న్ లు వ‌చ్చాయి. ఏక‌గ్రీవానికి ప్ర‌భుత్వం న‌జ‌రానాలు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ బ‌రిలో పోటీదారులు ల‌క్షకు పైగా వుండ‌టం గ‌మ‌నార్హం.