తెలంగాణలో ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణం

Telangana MLC
Telangana MLC

తెలంగాణ శాసన మండలి లో ఐదుగురు ఎమ్మెల్సీలతో మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసన సభ్యుల కోటాలో హోం మంత్రి మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, యగ్గే మల్లేషం, ఎంఐఎం నాయకుడు మర్జా రియాజ్‌ హసన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టి ఆర్ ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ , మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.