కొలువు తీరిన తెలంగాణ అసెంబ్లీ

Telangana Legislative Assembly
Telangana Legislative Assembly

తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ తొలి సారిగా కొలువు దీరింది. సీఎం కేసీఆర్ ఎమ్మ్యెలేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఇంగ్లీష్‌లో ప్రమాణస్వీకారం చేయగా.. మిగతా నలుగురు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.

అయితే ఈ సారి అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే కేసీఆర్(8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు) కాగా, వయసు రీత్యా వనమా వెంకటేశ్వరావు(73) సీనియర్ సభ్యుడు. వనమా వెంకటేశ్వరావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. ఇక అత్యంత పిన్న వయసు బానోతు హరిప్రియది. ఆమె వయసు 29 సంవత్సరాలు.. కాగా ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు.

ఇక ఉమ్మడి అసెంబ్లీలో సభ్యులుగా ఉండి ప్రస్తుతం ఎన్నికైన వారు -16మంది, గత అసెంబ్లీలో సభ్యులుగా ఉండి మళ్లీ ఎన్నికైన వారు – 76 మంది, పూర్తిగా కొత్తవారు -23మంది, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎంపీలు ఇద్దరు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ముగ్గురు, ముస్లిం మైనార్టీ సభ్యులు ఎనిమిది మంది, మహిళా సభ్యులు ఆరుగురు, ఆంగ్లో ఇండియన్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు.. అంతకు ముందు ప్రగతి భవన్ నుంచి గన్ పార్కుకు కేసీఆర్ వెళ్లారు. గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు