పోరాటంలో తెలంగాణ‌నే స్ఫూర్తి – జ‌న‌సేనాని ప‌వ‌న్

PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,
PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,

ఫిబ్రవరి రెండోవారంలో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు. వీటిలో రైతాంగ సమస్యల్ని విపులంగా చర్చిస్తామన్నారు. నివారణకు అనువైన ప్రణాళికల్ని రూపొందిస్తామ్నారు.

తామధికారంలోకి రాగానే బకింగ్‌హామ్‌ కెనాల్‌ను పునరుద్దరిస్తామన్నారు. గుంటూరు జిల్లా పెదరావూరు వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్‌కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతుల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మహిళలు, కార్యకర్తల్తో విడివిడిగా సమావేశాలు జరిపారు.

ఈ సందర్బంగా ఆయన వార్నుద్దేశించి మాట్లాడారు. మార్పు రావడం ఖాయ మని చెప్పారు. 2019 తమకు తొలి ఎన్నికలే తప్ప ఆఖరివి కాదన్నారు. పోరాటంలో తెలంగాణాను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు అక్కడి యువత, ప్రజలు ఏకతాటి పైకొచ్చి పోరాటం చేశారన్నారు.

రాష్ట్ర భవిష్యత్‌ విషయంలో కూడా ఇలాంటి స్పూర్తి ఆంధ్రప్రదేశ్‌లో కనిపించాలన్నారు. డెల్టా ప్రాంత రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత జనసేనపై ఉందన్నారు.