తెలంగాణ‌లో కాంగ్రెస్ ఓట‌మి త‌ర్వాత‌..!

T Congress LEADERS

తెలంగాణ‌లో ఓట‌మిని త‌ట్టుకోలేని కాంగ్రెస్ నేత‌లు గాంధీభ‌వ‌న్‌లో మొహం చూపించ‌డ‌మే మానేశారు.అయితే హై క‌మాండ్ వ‌త్తిడితో రానున్న ఎన్నిక‌ల‌కు మ‌ళ్ల సిద్ద‌మ‌వుతున్నారు.ఓట‌మిని జీర్ణించుకోలేని ఆ పార్టీ పెద్ద‌లు ఇప్పుడు పోస్ట్ మార్ట‌మ్ మొద‌లెట్టారు.అధిష్టానానికి ఇప్ప‌టికే ఒక నివేదిక‌ను సైతం అంద‌జేశారు.తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,నేతలు షబ్బీర్ అలీ, సంపత్, పద్మావతిరెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి,అద్దంకి దయాకర్, దామోదర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు పాల్గొన్నారు.కాంగ్రెస్ ఓటమి మీద చర్చించిన నేతలు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు స‌మాచారం.అతి తక్కువ తేడాతో ఓటమి పాలైన రాష్ట్రంలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని నేతలు ఒక అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.

ఈ సమావేశంలో ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేసిన నేతలు కోర్టుకు వెళ్లేందుకు అవసరమైన ఆధారాలను కుంతియాకు వెల్లడించార‌ట‌.ఆయా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు …కౌంట్ చేసిన ఓట్లకు మధ్య తేడా ఆధారాలతో సహా కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది.ఇప్పటికే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితంపై కోర్టును ఆశ్రయించారు.ఇదే తరహాలో మిగిలిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నట్లుగా స‌మాచారం. ఎది ఏమైనా చేతుకు కాల‌క ఆకులు ప‌ట్టుకోవ‌డ‌మంటే ఇదే మ‌రి…