టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్.. టెన్ష‌న్…

KCR
KCR

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినా.. కేబినెట్‌లో ఎంతమందికి చోటు దక్కుతుందన్నదానిపై క్లారిటీ లేదు. దీంతో ముఖ్యంగా కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఈనెల 19వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు కొత్త మంత్రులు కొలువు తీరనున్నారు.అయితే ఎవ‌రెవ‌రికీ ఈ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం వుంటుందోన‌ని తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది. అస‌లు ఎంత మందికి స్థానం ల‌భిస్తుంది, వాటిలో త‌మ బెర్తు వుంటుందా, వుండ‌దా అనేది స‌స్పెన్స్ గా మారింది.

కొంతమంది పేర్లు తెరపైకి వచ్చినా అధికారికంగా వెల్లడి కాలేదు. జిల్లాలు, సామాజిక అంశాలను బేరేజు వేసుకుని ఎవరికి వారే తమకు మంత్రి పదవి ఖాయమన్న ధీమాలో ఉన్నారు. విస్తరణకు డేట్ ఫిక్స్ చేసిన సిఎం కేసీఆర్.. ఎవరెవరికి చోటు కల్పిస్తారనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు.

దీంతో అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న‌ట్లు స‌మాచారం. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో హైదరాబాద్‌లో మకాం వేసిన గులాబీ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు. కొందరు పేర్లు ప్రచారంలో ఉన్నా.. అధికారికంగా ఇంకా సమాచారం రాకపోవడంతో వారిలో టెన్షన్ రెట్టింప‌వుతోంది.