17 సిఎం కేసీఆర్ బ‌ర్త్ డే వేడుక‌ల‌కు స‌ర్వం సిద్దం

KCR, CHANDRASHEKAR, BEST WISHES, HAPPY NEW YEAR, 2019, PROGRAMS,
NEW YEAR

తెలంగాణ ముఖ‍్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ నెల 17వ తేదీన జలవిహార్‌ జరగనున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్ల‌డించారు. ఆయన జలవిహార్‌లోని జన్మదిన వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.

నాలుగేళ్ల మూడు నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కేసీఆర్‌ జన్మదినాన్ని కోలాహలంగా నిర్వహిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. జలవిహార్‌లో తెలంగాణ సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా కళాకారులతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు జానపద గీతాల పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్నప‌లు పథకాలను వివరించే స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

కేసీఆర్‌ జీవిత నేపధ్యం తెలిపేలా భారీ ఫోటో ఎగ్జిబిషన్ నెల‌కొల్ప‌నున్నారు. ఇక పదిహేడో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిన మహంకాళి అమ్మవారి ఆలయంలో గణపతి హోమం, ఆయూష్‌ హోమం, చండీహోమం నిర్వహిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు త‌ల‌సాని.