సీఎం జగన్‌ వయసు చిన్నది.. బాధ్యత పెద్దది – కేసీఆర్

Telangana CM KCR
Telangana CM KCR

నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఇదొక ఉజ్వల ఘట్టం అని వ్యాఖ్యానించారు. అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగటానికి ఈ ఘట్టం బీజం వేస్తుందన్నారు. సీఎం జగన్‌ వయసు చిన్నది..బాధ్యత పెద్దద‌న్నారు ఆయ‌న‌. శక్తి, సామర్థ్యం, స్థైర్యం, ధైర్యం మీకుందని గత 9ఏళ్లలో ప్రస్పుటంగా నిరూపించార‌న్నారు తెలంగాణ సిఎం కేసీఅర్. మనం చేయాల్సింది కత్తులు దూసుకోవడం కాదు..కరచాలనం చేసుకోవాల‌న్నారు. గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. జగన్‌.. మీ నాన్న పేరు నిలబెట్టాలి. ఒక్కసారి కాదు..మూడునాలుగు సార్లు .. జగన్‌ రాష్ట్రాన్ని పాలించాలని దీవిస్తున్నాను అంటూ ప్ర‌సంగించారు సిఎం కేసీఆర్ .