తెలంగాణ సిఎం కేసీఆర్ బడ్జెట్ హైలైట్స్ – 2019-20

Telangana Budget
Telangana Budget

తెలంగాణ‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేసిన మొద‌టి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. బడ్జెట్‌లో సాగునీటి రంగానికే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల హామీల అమలుతో పాటు సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు 2019-20 బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపులు జ‌రిపారు. రైతు రుణాలు మాఫీపై బ‌డ్జెట్‌లో సీఎం కేసీఆర్ రైతులకు స్పష్టత ఇచ్చారు. 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

రంగాల వారీగా నిధుల కేటాయింపులు

నీటి పారుదల శాఖకు రూ.22,500 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖకు రూ.5,536కోట్లు
రైతు రుణ మాఫీ కోసం రూ.6 వేల కోట్లు
రైతుబంధు – రూ. 12 వేల కోట్లు
రైతు బీమా – రూ. 650 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ. 1,835 కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 10,716 కోట్లు
పంచాయతీరాజ్‌ శాఖకు రూ. 8,443 కోట్లు
క‌ల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు.
నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు
ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు
ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు
బియ్యం రాయితీకి రూ.2,774కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
సాంఘిక సంక్షేమం -రూ. 14,005 కోట్లు
గిరిజన సంక్షేమం – రూ. 8,970 కోట్లు
బీసీ సంక్షేమం – రూ. 4,528 కోట్లు
మహిళా సంక్షేమం – రూ. 1,628 కోట్లు
టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.1,41 లక్షల కోట్లు పెట్టుబడులు
టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు
పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు భర్తీ
ఏప్రిల్‌ చివరినాటికి మిషన్‌ భగీరధ పనులు పూర్తి
మరో 2 నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచి నీరు
542 కొత్త గురుకులాలు ఏర్పాటు
వచ్చే విద్యాసంవత్సరం నుంచి 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం 51 డిగ్రీ గురు కులాలు
విదేశీ విద్య కోసం అన్ని వర్గాల వారికి రూ.20 లక్షల స్కాలర్ షిప్
ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసం ఏటా రూ.440 కోట్లు
40 ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు
ఇప్పటి వరకు 2,72,763 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు